Vastu Tips: ఇంటి తలుపులు ఆ దిశలో ఉంటే ఇంట్లో అన్ని సమస్యలే….తలుపులు ఏ దిశలో ఉండాలో తెలుసా..!

Vastu Tips

Vastu Tips: ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి యెంత ప్రాధాన్యత ఉందో అలాగే ఇంటి తలుపులు కూడా వాస్తు ప్రకారం ఉండాలని వాస్తు శాస్త్రం సూచిస్తుంది.ఇంటి నిర్మాణంలో తలుపులు కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి.ఎందుకంటే తలుపులు భద్రతను అందించడమే కాకుండా వాస్తు ప్రకారం తలుపులు సరైన దిక్కులో ఉంటె ఆ ఇంట్లో సుఖసంతోషాలు మరియు ఆర్ధిక సమస్యలు వంటివి రాకుండా ఉంటాయి.ఇంట్లో అనారోగ్యం,ఆర్ధిక సమస్యలు మరి ఏ ఇతర సమస్యలు ఉన్న కూడా వాటి వెనుక కారణం తలుపులు వాస్తు ప్రకారం సరైన దిశలో లేకపోవడం కూడా ఉండచ్చు.

ఇంట్లో వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం తలుపులు ఎప్పుడు కూడా తూర్పు దిశలో ఉండాలి అని నిపుణులు చెప్తున్నారు.ఇలా తూర్పు దిశలో ఉండడం వలన తెల్లవారు జామున సూర్య కిరణాలూ నేరుగా ఇంట్లోకి వస్తాయి.దాంతో ఆ ఇంట్లో ఆరోగ్య సమస్యలు వంటివి రాకుండా ఉంటాయి.అలాగే ఈ దిశలో నుంచి సంపద,సంతోషం వంటివి వస్తాయి.తూర్పు దిక్కున ప్రధాన ద్వారం ఉంటె వాస్తు శాస్త్రం ప్రకారం వ్యక్తి జీవిత రేఖ కూడా చాల కలం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.అదే ఇంటి ప్రధాన ద్వారం ఆగ్నేయ దిశలో ఉంటె అది తీవ్ర వాస్తు దోషం అని నిపుణులు చెప్తున్నారు.

అలా తలుపులు ఆగ్నేయ దిశలో ఉంటె ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు యెంత కష్టపడి సంపాదించినా కూడా వాస్తు దోషం కారణంగా ఆ ఇంట్లో డబ్బు నిలువ ఉండదు అని నిపుణులు చెప్తున్నారు.ఇంటికి సంబంధించిన ప్రధాన ద్వారం తలుపును తయారు చేసేటప్పుడు దాని దిశలో పాటు పరిమాణాన్ని కూడా చూడాలి అని వాస్తు నిపుణులు చెప్తున్నారు.వాస్తు శాస్త్రంలో ఉండే నియమాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం తలుపులు పొడవు రెండు రెట్లు వెడల్పుగా ఉండాలి అని చెప్తున్నారు నిపుణులు.అలాగే రెండు వైపులా ఉండాలి.ఇంట్లి ప్రధాన తలుపులు తెలుపు,లేత నీలం,లేత ఆకుపచ్చ రంగులో ఉండాలి అని చెప్తున్నారు.ప్రధాన తలుపును నలుపు రంగుతో అస్సలు ఉండకూడదు అని చెప్తున్నారు నిపుణులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *