Home » బిజినెస్ » Aadhaar card: మీ ఆధార్ కార్డు సేఫ్ గా ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి.!

Aadhaar card: మీ ఆధార్ కార్డు సేఫ్ గా ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి.!

Aadhaar card
Aadhaar card

Aadhaar card: గత కొన్ని ఏళ్ల నుంచి ఆధార్ కార్డు వివరాలతో చాలా మోసాలు వెలుగులోకి వచ్చాయి. వేరే వ్యక్తుల ఆధార్ తో సిమ్ కార్డు తీసుకొని ఆ సాంఘిక కార్యకలాపాలకు వాడుతున్న ఉదంతాలు ప్రతిరోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలోనే మన ఆధార్ కార్డు (Aadhaar card) సేఫ్ గా ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ప్రతి మనిషికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. ఒక సిమ్ కార్డు కావాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్న, ఇంటి అద్దెకు దిగిన ఇలా ప్రతిదానికి ఆధార్ను ప్రూఫ్ గా చూపించాలి.

అయితే గత కొన్ని ఏళ్ల నుంచి ఆధార్ కార్డు వివరాలతో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆధార్ కార్డు దోపిడీకి గురి అయితే బాధితులు వారి పేరుతో నిర్వహించిన కార్యకలాపాల కారణంగా బ్లాక్ చేయబడిన సేవలు, ఆర్థిక నష్టం లేదా చట్టపరమైన సమస్యలను కూడా ఎదురుకోవాల్సి వస్తుంది.కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డు సేఫ్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవడానికి మై ఆధార్ పోర్టల్ కి వెళ్లి మీ ఆధార్ నెంబర్, క్యాప్చర్ కోడ్ను నమోదు చేసి ఓటిపి తో లాగిన్ అవ్వాలి.

మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఖాతాను యాక్సెస్ చేయడానికి ఓటిపిని నమోదు చేయండి. ఆ తర్వాత ప్రమాణీకరణ చరిత్ర ఆప్షన్ను ఎంచుకొని మీరు సమీక్షించాలి అనుకుంటున్నా కాలానికి తేదీ పరిధిని ఎంచుకోండి. ఆ లాగ్ ను బాగా తనిఖీ చేసి ఏదైనా తెలియని లేదా అనుమాస్పదలావాదేవిల కోసం చూడండి. ఏదైనా అనధికార కార్యాచరణను గుర్తించినట్లయితే వెంటనే దానిని UIDAI యొక్క టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1947 కి కాల్ చేయండి.