Ration Cards: ప్రజలకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ఉన్న అనేక సంక్షేమ పథకాలను భారత ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఒక ప్రత్యేక పథకం ద్వారా ప్రజలకు తక్కువ ధరకే రేషన్ అందించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఈ పథకం అమలు చేయబడుతుంది. అర్హత కలిగిన వ్యక్తులు ప్రభుత్వం అందించే ఈ ఉచిత రేషన్ సౌకర్యం పొందగలరు. అర్హత ప్రమాణాలను పాటించే వ్యక్తులకే ఈ పథకం ప్రయోజనాలు లభిస్తాయి.
ఇప్పటికే ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డు (Ration Cards) హోల్డర్లకు మాత్రమే ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఈ మార్గదర్శకాలను పాటించని వారు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రేషన్ పొందలేరు అని సమాచారం. రేషన్ కార్డు హోల్డర్లు ఈ పథకం కింద ప్రయోజనాలు పొందాలంటే ఈ కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయనివారు రేషన్ పొందలేరు.
కొత్త మార్గాదర్శకాల ప్రధాన లక్ష్యం నకిలీ రేషన్ కార్డు హోల్డర్లను గుర్తించడమే. ప్రభుత్వం ఈ కేవైసీ ప్రాసెస్ ద్వారా నక్లిరేషన్ కార్డు హోల్డర్లను గుర్తించనుంది. నకిలీ రేషన్ కార్డు హోల్డర్లను పథకం నుండి తొలగించడం జరుగుతుంది. నిజమైన అర్హత ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ పథకం అందుబాటులో ఉంటుంది. మీకు దగ్గరలో ఉండే ఆహార సరఫరా కేంద్రానికి వెళ్లి ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.