Home » బిజినెస్ » Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్తను చెప్పిన ప్రభుత్వం.. మార్చి 15 లోపు వాళ్ళ అకౌంట్లో లక్ష రూపాయలు

Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్తను చెప్పిన ప్రభుత్వం.. మార్చి 15 లోపు వాళ్ళ అకౌంట్లో లక్ష రూపాయలు

Indiramma Illu
Indiramma Illu

Indiramma Illu: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లపై మరో శుభవార్తను తెలిపింది. ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల కోసం లక్షల మంది అప్లై చేసుకున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర ప్రజల కోసం శుభవార్త చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు ఇల్లులేని వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

రిపబ్లిక్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభంలో భాగంగా మొదటి రోజు మండలంలోని ఒక గ్రామంలో ఎంపిక చేసి అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరి నుంచి ప్రజా పాలన మరియు గ్రామసభల ద్వారా దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను జిల్లాల వారీగా ప్రకటించింది. తొలివిడతల భాగంగా ఇంటి స్థలం కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో కోడ్ లేని జిల్లాల్లో అర్హులైన 71,480 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను ప్రభుత్వం పంపిణీ చేసింది.ఇప్పటికే వీరుల కొంతమంది ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వారికి శుభవార్తను తెలిపింది. మార్చి 15వ తేదీలోగా బేస్మెంట్ పూర్తి చేసిన వారికి అకౌంట్లో ₹1,00,000 జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీటికోసం గృహ నిర్మాణ శాఖకు రూ.715 కోట్లు కేటాయించింది. అధికారులు అర్హులైన లబ్ధిదారుల నుంచి వివరాలను ఫోటోలను సేకరించి ఫైనల్ జాబితా రెడీ చేస్తారు. తొలివిడిత లక్ష రూపాయలను వారికి మాత్రమే అందజేస్తారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తొలి విడతగా 25000 ఇల్లు మంజూరయ్యాయని సమాచారం.