Electricity Bill: మధ్యతరగతి కుటుంబాలకు పెరిగే కరెంటు బిల్లు వాళ్ళ ఆర్థిక స్థితిని గుర్తు చేస్తుంది. రోజురోజుకు ప్రభుత్వం పెంచే చార్జీలతో ప్రతి నెల కరెంటు బిల్లు పెరుగుతూ వస్తుంది. ప్రతి ఇంట్లో కూడా కరెంట్ బిల్లును తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలోనే ఇంట్లో పవర్ఫుల్ టూల్స్, ఎల్ఈడి బల్బులను ఉపయోగిస్తారు. కొన్నిసార్లు చిన్న చిన్న పరిపాట్లు కూడా అధిక విద్యుత్ వినియోగానికి కారణం అవుతాయి. ఇప్పుడు త్వరలో వేసవికాలం వస్తున్న సంగతి తెలిసిందే.
కరెంట్ బిల్లు వేసవిలో మరింత ఎక్కువగా వస్తుంది. వేసవిలో కరెంట్ బిల్లును తగ్గించుకోవడానికి కొన్ని రకాల చర్యలను చేపట్టవచ్చు. నాన్ ఇన్వర్టర్ ఏసీ ని వాడడాన్ని తగ్గించి, ఇన్వర్టర్ ఏసీ ని వాడాలి. ఇది సాధారణ ఏసీ తో పోలిస్తే చాలా తక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. ఇది కంప్రెసర్ ని బట్టి కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీనికి తక్కువ విద్యుత్ అవసరం అవుతుంది.
అవసరాన్ని బట్టి ఇంట్లో ఫ్యాన్ ను వాడాలి. మీరు గదిలో లేని సమయంలో ఫ్యాన్ ను ఆఫ్ చేయాలి. ఫ్యాన్ ను రెగ్యులర్గా క్లీన్ చేయడం అలాగే మైంటైన్ చేయడం వలన విద్యుత్ ఆదా చేయవచ్చు. ఇంట్లో ఎల్ఈడి బల్బులను వాడడం వలన కూడా విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చు. మైక్రోవేవ్ అనవసరంగా ఆన్ చేసినప్పుడు అది ఎక్కువ విద్యుత్ను వినియోగిస్తుంది. మైక్రోవేవ్ను స్టాండ్ బై మూడులో ఉంచడం వలన కూడా అవి విద్యుత్ను ఖర్చు చేస్తాయి.