Ration Card: కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు కీలక అప్డేట్ ను జారీ చేసింది. 2025 మార్చి 31 నాటికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే సబ్సిడీపై వచ్చే ఆహార ధాన్యాల సౌకర్యం కోల్పోతారని తెలిపింది. అయితే ఇంకా ఈ ప్రక్రియను 7.55 లక్షల మంది పూర్తి చేయలేదు అని తెలుస్తుంది. రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. రేషన్ కార్డు ఉన్నవాళ్లు మార్చి 31 2025 నాటికి ఈ కేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. లేకపోతే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై అందించే ఆహార ధాన్యాల సౌకర్యాన్ని కోల్పోతారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం ఇంకా 7.55 లక్షల మంది ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదని తెలుస్తుంది. అయితే తాజాగా ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే ప్రభుత్వం అందించే ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో మోసాలు మరియు నకిలీ కార్డుదారులను గుర్తించేందుకు ఈ కేవైసీని ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ కేవైసీ ద్వారా ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీపై ఆహారం అందేలా చూస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా అనర్హులు మరియు నకిలీ రేషన్ కార్డుదారులు తొలగిపోయేలా ప్రభుత్వం చేస్తుంది.
ఇప్పటివరకు రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయనివారు కచ్చితంగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. రేషన్ దుకాణంలో లేదా ఆన్లైన్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయని వాళ్ళు కూడా త్వరగా పూర్తి చేసుకోవాలి అని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇంకా అసంపూర్ణంగా సమాచారం ఉన్నవాళ్లు తొందరగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అయితే ఈ కేవైసీ ప్రక్రియకు అవసరమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియ చాలా సులభం అని తెలుస్తుంది. రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది. ఇప్పటివరకు రేషన్ కార్డు ఈ కేవైసీ చేయించుకొని లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు మరియు బయోమెట్రిక్లను అందిస్తే సరిపోతుంది.