
Ration Card : రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను అమలు చేయడంలో ఖచ్చితత్వం కోసం నిరంతరం మార్పులు చేపడుతున్నారు. ప్రతి పథకం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మనదేశంలో రేషన్ కార్డుల లబ్ధిదారులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో రేషన్ కార్డులలో అక్రమాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
మనదేశంలో పేద కుటుంబాలు చాలానే ఉన్నాయి. వాళ్ల రోజువారీ సంపాదన చాలా తక్కువగా ఉంటుంది. ఆర్థికంగా వాళ్ళందరూ నిలదొక్కుకొని పైకి రావడం అంత సులభమైన పని కాదు. ఈ క్రమంలో వాళ్లను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం రేషన్ ద్వారా ప్రతినెలా వాళ్లకు బియ్యం మరియు గోధుమలను అందిస్తుంది.
ఆయా రాష్ట్రాలలోని ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్ర ప్రజలకు ఆదుకునేందుకు బియ్యంతో పాటు, పంచదార, కందిపప్పు వంటి ఇతర నిత్యవసర వస్తువులను కూడా అందిస్తున్నారు. ఈ రేషన్ వ్యవస్థ సక్రమంగా ఉండేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇది చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు ఉచితంగా రూ.50 వేలు సాయం
అయితే దాని గడువు మార్చి 31 వరకు ఉండేది. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినట్లు సమాచారం. అందువల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరూ ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలి. ఇది చాలా ముఖ్యం. రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన రేషన్ కార్డు లబ్ధిదారులకు మాత్రమే రేషన్ బియ్యం ఇవ్వాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటే వారి యొక్క వివరాలు చాలా పక్కాగా ఉంటాయి. ఈ క్రమంలో వాళ్లు రేషన్ పొందేందుకు అర్హులో కాదో తెలిసిపోతుంది. అందుకోసం అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వం అందిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియను తప్పక పూర్తి చేయాలని చెబుతుంది. ఏప్రిల్ 30 తర్వాత అంటే మే 1 నుంచి అర్హులైన వారికి మాత్రమే ప్రభుత్వం రేషన్ సరుకులను అందిస్తుంది.