Ration Card: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవాళ్లకి ఒక గుడ్ న్యూస్ తెలిపింది. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీ ప్రభుత్వం ప్రారంభిస్తుంది. గత కొన్ని నెలల నుంచి కందిపప్పు సరఫరాలో కొరత ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే మార్కెట్లో కందిపప్పు ధరలు అధికంగా ఉండటం వలన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెల నుంచి కందిపప్పును ప్రజలకు అందించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు.
వచ్చేనెల ఏప్రిల్ నుంచి తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకు గతంలో ఇచ్చిన విధంగానే కందిపప్పును విధిగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. గత రెండు మూడు నెలల నుంచి ప్రజలకు కందిపప్పు సరిగా అందడం లేదు. దీంతో అధికారులు దీనిపై పూర్తి దృష్టి సారించారు. ఎప్పుడైనా నుంచి కందిపప్పును ప్రజలకు పంపిణీ చేయడానికి ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో కేవలం మూడు జిల్లాలలో మాత్రమే కందిపప్పు పండుతుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ మూడు జిల్లాల నుంచి కందిపప్పును కొనుగోలు చేసి రాష్ట్రమంతటా సరఫరా చేయాలి.
కందిపప్పు కు బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నందున రైతులు ప్రభుత్వానికి కాకుండా వ్యాపారులకు తమ పంటను అమ్మడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వద్ద ఉన్న కంది నిల్వలు సరిపోవడం లేదు. అయితే ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి కందిపప్పును తెప్పించే రాష్ట్రమంతటా పంపిణీ చేస్తుంది. గత జనవరి ఫిబ్రవరి నెలలో ముందుగా డీడీలు కట్టిన డీలర్లకు మాత్రమే కందిపప్పును సరఫరా చేసిన సుమారు 50 శాతం మందికి మాత్రమే కందిపప్పు అందింది. మార్చి నెలలో ఎవరికి కూడా కందిపప్పు అందించలేదు. అయితే గత ఏడాది నవంబర్ డిసెంబర్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం డిపోలో ద్వారా పూర్తిస్థాయిలో బియ్యం పంచదారతో పాటు కందిపప్పును కూడా అందించింది.