LPG Gas: ప్రతి ఒక్కరి ఇంట్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటారు. అయితే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు రూ.40 లక్షల ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఉంది. ప్రమాదం జరిగినప్పుడు ఈ బెనిఫిట్ ను పొందవచ్చు. మన నిత్య జీవితంలో గ్యాస్ సిలిండర్ కూడా ఒక భాగం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే వస్తువులలో గ్యాస్ సిలిండర్ తప్పనిసరిగా ఉంటుంది. ఒకప్పటి రోజుల్లో కట్టెల పొయ్యి మీద లేదా కిరోసిన్ స్టవ్ తో వంట చేసేవాళ్లు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్ మీదనే వంట చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ వినియోగించే చాలామందికి దీనికి సంబంధించిన బెనిఫిట్స్ గురించి తెలియదు.
ఆ బెనిఫిట్స్ లో ఒకటి రూ.40 లక్షల బెనిఫిట్. గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు ఈ బెనిఫిట్ అందజేస్తుంది. అయితే ఈ బెనిఫిట్ అనుకొని అగ్నిప్రమాదం జరిగి, కుటుంబానికి నష్టం జరిగినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. ఏ కంపెనీ ఎల్పీజీ సిలిండర్ ఉన్నా కూడా వారికి ఉచితంగా ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఉంటుంది. గ్యాస్ సిలిండర్ ద్వారా ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబ సభ్యులకు ఆసరాగా ఈ బెనిఫిట్ ఆ సిలిండర్ కంపెనీలు అందిస్తున్నాయి. ఇన్సూరెన్స్ పూర్తిగా ఉచితం. దీనికోసం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ పొందిన వెంటనే వాళ్లకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రూ.40 లక్షల వరకు లభిస్తుంది. గ్యాస్ కారణంగా ఇంట్లో ఏమైనా పేలుడు ఘటనలు జరిగితే పర్సనల్ ఆక్సిడెంట్ కవర్ అందిస్తారు. అయితే ఈ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారికి మాత్రమే ఈ బెనిఫిట్ లభిస్తుంది. గ్యాస్ కారణంగా ఇంట్లో ఏమైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం తాలూకు వివరాలను సదరు గ్యాస్ కంపెనీకి తెలియజేయాలి. అప్పుడు పెట్రోలియం కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ తో మాట్లాడి బాధితులకు పరిహారం అందేలా చూస్తారు. గ్యాస్ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఒక్కో వ్యక్తికి ఐదు లక్షల బీమా కవరేజ్ ఉంటుంది. తీవ్ర గాయాలు అయినట్లయితే 15 లక్షల వరకు వైద్య ఖర్చులు కవరేజ్ ఉంటుంది. అలాగే ఆస్తి నష్టానికి రెండు లక్షల వరకు కవరేజ్ ఇస్తారు.