Budget 2025: దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం రోజున బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో అద్దె చెల్లించే వారికి శుభవార్తను తెలియజేశారు. ఇంటి అద్దె ద్వారా వచ్చే ఆస్తి ఆదాయపరిమితిని ఏడాదికి రూ2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచాలని బడ్జెట్లో తెలిపారు. అలాగే 2025- 26 ఆర్థిక సంవత్సరానికి గాను అద్దెపై టీడీఎస్ వార్షిక పరిమితిని పెంచుతున్నట్లు ఈ బడ్జెట్ లో ప్రకటించారు. తక్కువ అద్దెతో పన్ను చెల్లింపదారులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.
అద్దె ఆదాయం ఆర్థిక సంవత్సరంలో రూ.2.4 లక్షలకు మించకూడదని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194-I తెలుపుతుంది. ఒకవేళ ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు ఆదాయపు పన్ను మినహాయించాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో అద్దె ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితిని నెలకు 50,000 సంవత్సరానికి ఆరు లక్షలు పెంచాలని పేర్కొన్నారు.
వ్యక్తిగత పన్ను చెల్లింపదారులకు మరియు హిందూ అవిభక్త కుటుంబానికి కూడా ఈ నియమాలు వర్తిస్తాయి. అలాగే లివింగ్ కి కొన్ని నెలలు భూమి లేదా యంత్రాలను అద్దెకు తీసుకుంటే అద్దె రూపీస్ 50,000 దాటితే టిడిఎస్ మినహాయించబడుతుంది. టీడీఎస్ పరిమితిని అద్దెపై ఆరు లక్షలకు పెంచడం వలన చిన్న పన్ను చెల్లింపుదారులకు చాలా ప్రయోజనం కలుగుతుంది.