Instant Loan: ఉద్యోగం చేసే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా సులభంగా ఈ లోను అప్లై చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఫైనాన్షియల్ మార్కెట్లో ఇలాంటి లోన్ సర్వీస్ లాంచ్ చేసిన ఫస్ట్ NBFC గా పూనా వాళ పిన్ కార్ప్ నిలిచింది. కేవలం నిమిషాల వ్యవధిలో లోన్ పొందవచ్చు. బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు ఉద్యోగం చేసే వాళ్ళకి తక్కువ సమయంలోనే ఎక్కువ లోన్లు ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు క్షణాల్లోనే డిజిటల్ లోన్లు మంజూరు అవుతున్నాయి. తాజాగా సైరస్ పూనా వాళ గ్రూప్లో భాగమైన పూనా వాళ ఫిన్ కార్ప్ ఉద్యోగం చేసే వాళ్లకోసం పి ఎల్ ప్రైమ్ డిజిటల్ 24*7 పేరుతో ఒక స్పెషల్ డిజిటల్ పర్సనల్ లోన్ ఆప్షన్ను తాజాగా లాంచ్ చేయడం జరిగింది.
ఇది కూడా చదవండి: త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ…ముహూర్తం ఫిక్స్ చేసిన ప్రభుత్వం…ఆ రోజు నుంచే
ఉద్యోగులు ఎప్పుడైనా ఎక్కడైనా సరే సులభంగా ఈ లోను అప్లై చేసుకోవచ్చు. కేవలం 15 నిమిషాల్లో 15 లక్షల వరకు సెక్యూర్డ్ లోను ఉద్యోగులు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా తీసుకోవచ్చు. పూర్తిగా పేపర్ లెస్ గా ఉండే ఈ ప్రాసెస్ కోసం ఎటువంటి తాకట్టు అవసరం లేదు. సులభమైన రీపేమెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. రుణగ్రహితలు ఎక్కువ కాలం ఈఎంఐ టెన్ ఇయర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లోన్ ను poonawalla fincorp మొబైల్ యాప్, వెబ్సైట్ అలాగే ఆధరైజ్డ్ పార్ట్నర్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది అని సమాచారం.
ఇది కూడా చదవండి: మార్చి 31 వరకు మాత్రమే గడువు.. అద్భుతమైన పథకం.. దరఖాస్తు చేసుకోకపోతే మీ డబ్బులు పోతాయి
పూనా వాళ కార్ప్ ఎండి సీఈఓ అరవింద్ కపిల్ ఈ లోన్ ఆప్షన్ గురించి మాట్లాడుతూ డబ్బు అవసరమైనప్పుడు యాక్సెస్ సులభంగా మరియు ఫాస్ట్ గా ఉండాలి. ముఖ్యంగా బిజీగా ఉండే ప్రొఫెషనల్ కి చాలా అనుకూలంగా ఉండాలి అంటూ తెలిపారు. ఉద్యోగులకు అత్యవసరంగా డబ్బులు అవసరమైన లేదా ముందుగా ప్లాన్ చూసుకున్నది అయినా పిఎల్ ప్రైమ్ డిజిటల్ 24 * 7 అనేది మొదటి ఆప్షన్ గా నిలుస్తుంది. ఎలాంటి పేపర్ వరకు మరియు ఆలస్యం లేకుండా ఇన్స్టెంట్ లోను అందించడం మా లక్ష్యం అంటూ అరవింద్ తెలిపారు. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి లోన్ ప్రాసెస్ ను మారుస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ లోన్స్ లో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.