New Ration Cards: రాష్ట్రంలో చాలామంది ఎప్పటినుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రేషన్ కార్డులో జారీకి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి. దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రేషన్ కార్డులు జారీ చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ వార్తతో ఊరట లభిస్తుంది. అయితే ఉగాది పండుగ రోజున లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు వస్తాయని తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.
అలాగే రేషన్ కార్డులు ఎలా ఉండనున్నాయో, ఏ రంగులో ఉండనున్నాయో కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను నమూనాను ఫైనల్ చేసినట్టు సమాచారం. కొత్త రేషన్ కార్డులు లేత నీలిరంగులో ఉండనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల పై సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు ఉత్తంకుమార్ రెడ్డి ఫోటో కూడా ఉంటాయని సమాచారం. రేషన్ కార్డులపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఈ విధంగా కొత్త రేషన్ కార్డులు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారు కూడా వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు పొందే అవకాశం ఉంది.
అందరికీ కూడా కొత్త నమూనా తో ఉన్న రేషన్ కార్డులు అందుతాయని తెలుస్తుంది. అయితే దాదాపు 80 లక్షల రేషన్ కార్డులు రాష్ట్రంలో ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాది మార్చి 30వ తేదీన ఉగాది పండుగ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజే కొత్త రేషన్ కార్డుల మంజూరు కి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. అయితే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. కొత్తగా పెళ్లయి అత్తారింటికి వెళ్లిన మహిళలు పాత రేషన్ కార్డులో తమ పేరును తొలగించుకోవలసి ఉంటుంది. లేదంటే వాళ్లకు కొత్త రేషన్ కార్డు రావడం కష్టం.