Special Scheme: ప్రభుత్వ రంగ సంస్థ అందిస్తున్న ఈ పథకంతో మీ డబ్బులు సురక్షితంగా వస్తాయి. అది కూడా ఎక్కువ మొత్తంలో మీ డబ్బు రిటర్న్స్ వస్తాయి. మరి ఈ పథకం ఏంటో ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది భవిష్యత్తులో వచ్చే అవసరాల కోసం కొంచెం కొంచెం గా డబ్బులను దాచుకుంటూ ఉంటారు. సేఫ్ గా ఉండి ఎక్కువ వడ్డీ వచ్చే అవకాశం ఉన్న పథకంలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బిఐలో ఒక మంచి పథకం ఉంది. ఈనెల 31వ తేదీతో ఈ పథకం కోసం అప్లై చేసుకునే అవకాశం గడువు ముగుస్తుంది. చాలా మంచి లాభం వచ్చే ఈ పథకం ప్రయోజనాలు ఏంటో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి.
ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బిఐ we care డిపాజిట్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం వర్తిస్తుంది. సాధారణ ఎఫ్డి కంటే ఈ పథకంలో ఎక్కువ వడ్డీ రేటు ఉంటుంది. ఎస్బిఐ బ్యాంకు ప్రకారం ఈ పథకం 2024 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. సురక్షిత పెట్టుబడి మరియు మంచి రాబడిని కోరుకునే వాడికి ఇది చాలా మంచి అవకాశం.
ఈ పథకంలో సాధారణ ఎఫ్డి కంటే 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఉదాహరణగా చెప్పాలంటే సాధారణ ఎఫ్బి 6.50 ఉంటే ఈ పథకంలో సీనియర్ సిటిజనులకు 7 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక పెట్టుబడి పెట్టుకునే కాలం ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల వరకు ఉంటుందని సమాచారం. భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలు ఈ పథకంతో చాలా సులభతరం అవుతాయి. ఇది ప్రభుత్వ బ్యాంకు ద్వారా అందించబడుతున్న పథకం కాబట్టి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు హామీ కూడా ఉంటుంది.