AP Mega DSC 2024: మెగా DSC లో కేటగిరి వారీగా పోస్టులు ఇవే..!

AP Mega DSC 2024

AP Mega DSC 2024: ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు మెగా DSC గురించిన చెప్పిన సంగతి అందరికి తెలిసిందే.ఇక అన్నట్లు గానే చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత సీఎం గా మొదటి సంతకం మెగా DSC మీద చేసారు.మంత్రి వర్గం లో కూడా దీనికి సంబంధించి ఆమోదం లభించింది.గతం లో 2017 -2018 మధ్యలో టిడిపి హయం లో DSC నోటిగికేషన్ ను రిలీజ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే గత వైఎస్సార్ సిపి ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే DSC నోటిఫికేషన్ ను విడుదల చేసారు.ప్రస్తుతం ఎన్నికల తర్వాత సీఎం గా చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగా DSC మీద చేసి దాదాపుగా 16 ,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసారు.ఇక ఇందులో స్కూల్ అసిస్టెంట్ 7725 ,ఎస్జీటీ 6371 ,టీజీటీ 1781 ,పిజిటి 286 ,ప్రిన్సిపల్స్ 52 ,పీఈటీ 132 ఖాళీలు ఉన్నట్లు సమాచారం.

దాదాపు అయిదు సంవత్సరాల నుంచి ఎలాంటి నోటిఫికేషన రక ఆందోళన చెందుతున్న DSC అభ్యర్థులకు ఈ ప్రకటన ఊపిరి పోసింది అని చెప్పచ్చు.జీవో 117 ను రద్దు చేస్తే మరిన్ని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉంటాయని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి.గత ప్రభుత్వం ఆరు వేల వంద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.కానీ ఎన్నిక కోడ్ సమయంలో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది.ఏపీ లో పాఠశాలల విలీనానికి ముందు 36 వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు నివేదిక తెలిపారు అధికారులు.

ప్రస్తుత ప్రభుత్వం మెగా DSC 16 వేల పోస్టులు రిలీజ్ చేయడంతో DSC అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కర్నూల్ జిల్లాలో ఏకంగా 2678 పోస్టులు భర్తీ చేయనుండటంతో DSC కు ప్రిపేర్ అయ్యే వారిలో సంతోషం నెలకొంది.ఇక పై ప్రతి ఏడాది DSC నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఖాళీ అయినా టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *