Devullu Child Artist: దేవుళ్ళు సినిమాలో చిన్నారి ఇప్పుడు ఒక హీరోయిన్..ఎవరో తెలుసా!

Devullu Child Artist
Devullu Child Artist

Devullu Child Artist: 2000 సంవత్సరంలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా దేవుళ్ళు అందరికి గుర్తుండే ఉంటుంది.ఈ చిత్రానికి కోడిరామకృష్ణ దర్శకత్వం వహించారు.ఈ సినిమా లో పృథ్వి రాజ్,రాశి జంటగా నటించారు.ఈ సినిమలో వాళ్లకు ఇద్దరు పిల్లలుగా బేబీ నిత్యా మరియు మాస్టర్ నందన్ నటించారు.తల్లితండ్రుల ప్రేమ కోసం పరితపించిపోయే పిల్లలుగా నిత్యా మరియు నందన్ చాల బాగా ప్రేక్షకుల ఆదరణను పొందారు.

మీ ప్రేమ కోరే చిన్నారులం అంటూ బేబీ నిత్యా మరియు మాస్టర్ నందన్ తల్లితండ్రుల ప్రేమ కోసం పాడే పాట ఇప్పటికి కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బేబీ నిత్యా శెట్టి ఇప్పుడు హీరోయిన్ అయ్యింది.పిట్ట కథ అనే చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించడం జరిగింది.చైల్డ్ ఆర్టిస్ట్ గా నిత్యా చేసిన దేవుళ్ళు సినిమా ఆమెకు నటన పరంగా మంచి పేరు తెచ్చిపెట్టింది.

నిత్యా అంటే గుర్తుపట్టలేరు కానీ దేవుళ్ళు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం ప్రేక్షకులు బాగా గుర్తుపట్టగలరు.హీరోయిన్ గా నిత్యా శెట్టి చేసిన మొదటి సినిమా పిట్ట కథ ఆమెకు అనుకున్నంత విజయం సాధించి పెట్టలేదు.కానీ నటన పరంగా ఆమెకు మంచి పేరును తెచ్చిందని చెప్పాలి.ఇప్పుడు నిత్యా ను చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు అనే చెప్పాలి.హీరోయిన్ గా అయినా దేవుళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్ నిత్యా శెట్టి ఫోటోలు ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.