Sobhan Babu: ఎంతో అందంగా ఉన్న కూడా శోభన్ బాబు తన కొడుకుని సినిమాలలోకి ఎందుకు రానివ్వలేదో తెలుసా..!

Sobhan Babu: తెలుగు, తమిళ భాషల్లో సోగ్గాడిగా పేరు సంపాదించుకున్న నిన్నటి తరం ప్రముఖ నటుడు శోభన్ బాబు. గొప్ప గొప్ప సినిమాలు చేసి టాలీవుడ్, కోలివుడ్ చిత్ర పరిశ్రమలకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టారు అనడంలో సందేహం లేదు. టాలీవుడ్ లో అయితే ఆయనకు అప్పట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మహిళా ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఆయన విజయం సాధించారనే చెప్పవచ్చు. మంచి ఫ్యామిలీ డ్రామా స్టోరీలను ఎంపిక చేసుకొని ఆకట్టుకునే నటనను ప్రదర్శించడంతో పాటు డ్యాన్స్ లో ఆయన స్టయిలే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు.

కుటుంబ కథా చిత్రాలతో అందరి మనసులు గెలుచుకోవచ్చని, అలాంటి వాటికే మంచి ఆధరణ లభిస్తుందని గ్రహించి వాటినే ఎక్కువగా చూస్ చేసుకునేవారు ఆయన. దాదాపు అవి అన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్లుగా నిలిచేవి. ఒక దశలో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన కుటుంబంలో ఎవరినీ వెండితెర దరిదాపులకు కూడా రానివ్వలేదు. ఆ తరం ప్రముఖ నాయకులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వారసులు ఇప్పుడు చిత్ర పరిశ్రమను ఏలుతుంటే శోభన్ బాబు వారసులు ఎందుకు కనిపించడం లేదనే సందేహం కలుగకమానదు.

చిత్ర పరిశ్రమ, నటనపై మక్కువ ఎక్కువగా ఉన్న శోభన్ బాబు చదువుకునే వయస్సు నుంచే అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవారు. మొదట్లో చాలా తక్కువ నిడివి ఉన్న సన్నివేశాల్లో కనిపించిన ఆయన అంచలంచలుగా టాప్ హీరోగా ఎదిగారు. చెన్నయ్ నుంచి చిత్ర పరిశ్రమ విడివడి హైదరాబాద్ కు వచ్చినా ఆయన మాత్రం రాలేదు. ఇక ఆయన వారసత్వాన్ని ఇండస్ర్టీ వైపు వెళ్లనీయలేదు.

హీరో అంటే ఒన్లీ నటనే కాదు. చిత్ర పరిశ్రమకు సంబంధించి అన్ని రంగాలపై ఎంతో కొంత అవగాహన ఉండాలి అంటారు శోభన్ బాబు. ప్రతి సినిమాకు బాగా శ్రమించాలి. షూటింగ్ నుంచి విడుదలై అది ప్రేక్షకుల మన్ననలు పొందుతుందా, విమర్శలు పొందుతుందా..? ఇలా ఎన్నో ఒత్తిడితో కూడుకున్న అంశాలు ఉంటాయి. ఇలాంటి కష్టాలు తన వారసులకు రావద్దు అని ఆయన భావించారు. ‘సినిమా బడ్జెట్ తక్కువైనా, ఎక్కువైనా హీరో పడే టెన్షన్ ఒకేలా ఉంటుంది. అందుకే నా వారసులను చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంచాను’ అంటూ చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు శోభన్ బాబు. అలా ఆయన చూపిన బాటలో నడిచే వారి వారసులు కూడా చిత్ర పరిశ్రలో కనిపించలేదు.

Leave a Comment