TGSRTC: ప్రయాణికులు ఫుల్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పిన టిజిఎస్ ఆర్టీసీ..!

TGSRTC: సాధారణంగా బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు టికెట్ కొనుగోలు చేసేటప్పుడు చిల్లర కోసం చాల ఇబ్బంది పడుతుంటారు.టికెట్ కండక్టర్ లు కూడా ప్రయాణికులకు చిల్లర ఇవ్వడంలో చాల ఇబ్బందులు పడతారు.అయితే ఈసారి అలా టికెట్ కొనుగోలు చేయడంలో ఇప్పందులు లేకుండా TGSRTC ప్రయాణికులకు ఒక గుడ్ న్యూస్ తెలిపింది.ఈసారి ప్రయాణికులు చేతిలో నగదు లేకపోయినా చిల్లర లేకపోయినా టికెట్ కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

ఎందుకంటె నగర వ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో TGSRTC డిజిటల్ చెల్లింపులు చేసేందుకు రెడీ అవుతున్నారు.ఇక గూగుల్ పే,ఫోన్ పే,పే టిఎమ్,క్రెడిట్,డెబిట్ కార్డు స్వైపింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సిబ్బంది.ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది TGSRTC .నగరంలో మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి బస్సులో రద్దీ బాగా పెరిగిన సంగతి అందరికి తెలిసిందే.ఈ క్రమంలోనే అటు ప్రయాణికులకు ఇటు కండెక్టర్ లకు టికెట్ విషయంలో చిల్లర ఇబ్బందులు తప్పడం లేదు.అందుకే ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించి వాటికి సంబంధించిన చర్యలను చేపట్టారు ఆర్టీసీ సిబ్బంది.

Leave a Comment