Land : ఒక వ్యక్తి యెంత సాగు భూమిని కొనుగోలు చేయవచ్చో తెలుసా…షరతులు ఇవే..!

Land : భారతదేశం లో భూమి కొనుగోలు చేయడం అనేది ఎప్పటినుంచో మంచి పెట్టుబడి.చాల మంది కుటుంబాలలో భూమి కొనుగోలు ఆర్ధిక స్థిరత్వానికి చిహ్నంగా ఉంటుంది.భారతదేశం లో చాల గ్రామాలలో మరియు పట్టణాలలో బంగారం తో పాటు భూమి ని కూడా విలువైనదిగా మరియు గౌరవంగా భావిస్తారు.అయితే భారతదేశంలో ఒక వ్యక్తి యెంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేయాలి..దీనికి పరిమితి ఏమైనా ఉంటుందా…అనేది చాల మందికి తెలియదు.

ప్రాంతాన్ని బట్టి భూమి విలువ మరియు నిబంధనలు కూడా మారుతూ ఉంటాయి.చాల రాష్ట్రాల్లో ఇది పరిమితం.వ్యవసాయ భూమికి అలంటి నిబంధనలు ఏమి లేవు అని తెలుస్తుంది.హర్యానాలో ఒక వ్యక్తి కావాల్సినంత సాగు చేయని భూమిని కొనుగోలు చేసుకోవచ్చు.జమిందారీ వ్యవస్థ భారతదేశంలో రద్దు చేసిన తర్వాత జాతీయ స్థాయిలో కొన్ని మార్పులు చేసి రాష్ట్రాలకు కొన్ని హక్కులను కల్పించింది ప్రభుత్వం.

అందుకే యెంత భూమి కొనుగోలు చేయాలి అనేది రాష్ట్రాన్ని బట్టి ఉంటుంది అని చెప్పచ్చు.1963 భూ సంస్కరణలు చట్టం ప్రకారం కేరళ లో ఒక పెళ్లి కాని వ్యక్తి 7 .5 ఎకరాల భూమిని మాత్రమే కొనుగోలు చేయాలి.అయిదు మంది ఉన్న కుటుంబానికి 15 ఎకరాలు మాత్రమే భూమి ఉండాలి.మహారాష్ట్ర లో భూమి గరిష్ట పరిమితి 54 ఎకరాలు,అలాగే పశ్చిమ బెంగాల్ లో 24 .5 ఎకరాలు గరిష్ట పరిమితి ఉంది.

హిమాచల్ ప్రదేశ్ లో 32 ఎకరాలు అలాగే కర్ణాటక లో 54 ఎకరాలు భూమిని కొనుగోలు చేసుకోవచ్చు.రెండు తెలుగు రాష్ట్రాలలో 50 ఎకరాలు భూమిని కొనుగోలు చేయవచ్చు.అలాగే గుజరాత్ లో వ్యవసాయ భూమిని వ్యాపారులు మాత్రమే కొనుగోలు చేయాలి.విదేశీ పౌరుడు భారతదేశం లో వ్యవసాయ భూమిని,తోటను,ఫార్మ్ హౌస్ ను కొనుగోలు చేయలేరు.

Leave a Comment