Telangana: రుణమాఫీ,రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం..రుణమాఫీ వారికి మాత్రమే..!

Telangana: తెలంగాణ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం రైతు రుణమాఫీ పై నిర్ణయమా తీసుకోని వాటికి సంబంధించిన విధి విధానాలను వెల్లడించారు.మాట ఇస్తే మడం తప్పని నాయకుడు రాహుల్ గాంధీ అని ఆయన చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ అని ఆయన తెలిపారు.కాంగ్రెస్ మాట ఇస్తే వెనుకడుగు వేయదు అని ఆయన తెలిపారు.రాహుల్ గాంధీ రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని తెలిపిన సంగతి అందరికి తెలిసిందే.

ఇక ఆయన ఇచ్చిన హామీపై చర్చించాం..దాన్ని నెరవేరుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఈ క్రమంలోనే వివిధ బ్యాంకుల నుంచి రైతుల వివరాలను సేకరించటం జరిగింది.ఈ పదేళ్లలో గత ప్రభుత్వం రూ.28 వేల కోట్లు మాఫీ చేసింది.అయితే రైతులకు రూ.2 లక్షలు మాఫీ చేసే క్రమంలో రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయి.

అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల లోనే రైతుల రుణాలను మాఫీ చేసే క్రమంలో డిసెంబర్ 9 ,2023 లోపు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది.రైతుల భరోసాపై మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు చేసి రైతుల భరోసా పై వివిధ వర్గాల సూచనలతో విధివిధానాలు రూపొందిస్తాం అని తెలిపారు.

ఈ ఉపసంఘం నివేదిక జులై 15 నాటికీ అందజేస్తుంది.ఇక అర్హులైన ప్రతి ఒక్క రైతు కు రైతు భరోసా లభిస్తుంది.ఈ కమిటీ సభ్యులుగా శ్రీధర్ బాబు,పొంగులేటి వ్యవహరిస్తున్నారు.తెలంగాణాలో పంట రుణాల మాఫీకి ఆమోదం తీసుకున్న క్యాబినెట్ 2023 డిసెంబర్ 9 లోపు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలనీ నిర్ణయించింది.

Leave a Comment