Hair Fall Remedies: అతి తక్కువ సమయంలో ఈ వంటింటి చిట్కాలు పాటించి హెయిర్ ఫాల్ అలాగే అన్ని జుట్టు సమస్యలను తగ్గించుకోండి!

Hair Fall Remedies: ప్రస్తుతం మారుతున్నా జీవన శైలి విధానంలో చిన్న పిల్లల నుంచి నడివయసు వారి వరకు ప్రతి ఒక్కరు ఎదుర్కుంటున్న సమస్య జుట్టు రాలడం,చుండ్రు,యుక్త వయస్సు లోనే జుట్టు తెల్ల బడి పోవడం వంటివి.పెరుగుతున్న వాయు కాలుష్యం,మారుతున్నా ఆహారపు అలవాట్లు,వివిధ రకాలైన రసాయనాలతో కూడిన షాంపులను ఉపయోగించటం,శరీరానికి అవసరమైన విటమిన్లు సరైన మోతాదులో తీసుకోకపోవడం వంటి అనేక కారణాల వలన జుట్టు సమస్యలు ఏర్పడతాయి.

చాల మంది ఇటువంటి జుట్టు సమస్యల నుంచి బయటపడటానికి వివిధ రకాలైన ఆయిల్స్ ను,షాంపులను వాడుతూ ఉంటారు.ఇలా చేయడం వలన మూడుపదుల వయస్సులోనే బట్ట తలా వచ్చేస్తుంది చాల మందికి.గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం,శరీరంలో వేడి ఎక్కువగా ఉండటం వలన కూడా జుట్టు సమస్యలు ఏర్పడతాయి.ఆడవాళ్లు పొడవాటి ఒత్తుగా ఉండే జుట్టు కావాలని అనుకుంటారు.అందుకోసం మార్కెట్ లో దొరికే వివిధ రకాలైన ప్రొడక్ట్స్ ను యూస్ చేస్తూ ఉన్న కాస్త కురులను కూడా పాడు చేసుకుంటారు.జుట్టు పొడవుగా,ఒత్తుగా ఉండటం అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గిపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 .రెండు రెమ్మల కరివేపాకు,అలాగే తోలు తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక కలబంద రేకు,రెండు స్పూన్ల బియ్యం,రెండు స్పూన్ల నూనె ను ఒక మిక్సీ జార్ లో తీసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మెత్తటి పేస్ట్ ల చేసుకొని ఒక క్లాత్ సహాయంతో వడకట్టుకోవాలి.ఇలా తయారు చేసిన రసాన్ని ఒక గంట సేపు కూతుర్ల నుంచి చివర్ల వరకు రాసి ఆ తర్వాత హెర్బల్ షాంపూ తో వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేయడం వలన జుట్టు ఒత్తుగా,పొడవుగా అవుతుంది.అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

2 .ఒక పావులీటర్ కొబ్బరి నూనె లో ఒక కప్పు గోరింటాకు,గుప్పెడు ఎండిన మందార పువ్వులు,కొన్ని తులసి ఆకులు,అర కప్పు కరివేపాకు,చిటికెడు ముద్ద కర్పూరం వేసి పచ్చి వాసన పోయేంత వరకు మరిగించాలి.ఈ నూనెను ఒక సీసాలో వడకట్టుకొని ప్రతి రోజు జుట్టుకు రాసుకోవడం వలన జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

3 .అవిసె గింజలు చిట్కాలు పాటించడం వలన ఎలాంటి కండిషనర్లు జుట్టు కు వాడాల్సిన అవసరం ఉండదు.రెండు స్పూన్ల అవిసె గింజలు ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించాలి.అలా చేసిన తర్వాత జిగురుగా ఉన్న మిశ్రమాన్ని చల్లారిన తర్వాత జుట్టుకు రాసుకొని పావుగంట తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి.ఇలా చేయడం వలన జుట్టు షైన్ గా కనిపిస్తుంది అలాగే జుట్టు వత్తు గా పెరుగుతుంది.

Leave a Comment