Abbas Daughter: సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్ రావాలన్న కూడా ఆయా జోనర్స్ లో సినిమాలు ఎక్కువగా చేస్తుంటారు హీరోలు.సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో కొంతమందికి మాత్రమే కటౌట్,స్మైల్ ను బట్టి ఇమేజ్ వచ్చేస్తూ ఉంటుంది.చాల మంది తమ కెరీర్ మొదలైనప్పుడు లవ్ స్టోరీ కథలు ఉన్న సినిమాలు చేసి ఆ తర్వాత మాస్ సినిమాలు వంటివి ఎంచుకుంటూ ఉంటారు.లవర్ బాయ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు చాల మంది హీరోలు.సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోలలో కొంత మందిని చూసిన వెంటనే లవర్ బాయ్ టాగ్ ఇచ్చేయాలనిపించే హీరోలలో అబ్బాస్ కూడా ఒకరు అని చెప్పచ్చు.
అప్పట్లో హీరో అబ్బాస్ లవర్ బాయ్ గా బాగా ఇమేజ్ సంపాదించుకున్నారు అని చెప్పడంలో సందేహం లేదు.సినిమా ప్రేక్షకులు హీరో అబ్బాస్ ను లవర్ బాయ్ హ్యాండ్ సమ్ అంటూ ప్రశంసించేవారు.వెస్ట్ బెంగాల్ లో పుట్టి పెరిగిన అబ్బాస్ తమిళ్ లో హీరో గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.తెలుగులో అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.మోడలింగ్ రంగంలో తన కెరీర్ స్టార్ట్ చేసిన అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ క్రేజ్ ను ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు.
ఆ సినిమా హిట్ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకొని లవర్ బాయ్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు.తన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపుగా 60 సినిమాలలో నటించిన అబ్బాస్ తమిళ్ లో ఎక్కువ సినిమాలలో నటించడం జరిగింది.అబ్బాస్ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అతని సినిమాలకు ఫ్యాషన్ డిసైనర్ గా వర్క్ చేసిన ఇరుం అలీ అబ్బాస్ ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత హీరోగా సినిమాలు తగ్గించేసినప్పటికీ అబ్బాస్ పలు కమర్షియల్ యాడ్స్ లో నటించడం జరిగింది.అబ్బాస్ ఫ్యామిలీ గురించి చాల తక్కువ మందికి మాత్రమే తెలుగు.అబ్బాస్,ఇరుం అలీ దంపతులకు ఒక కొడుకు మరియు ఒక కూతురు ఉన్నారు.అబ్బాస్ లాగానే అతని భార్య పిల్లలు కూడా చాల అందంగా ఉంటారు.అబ్బాస్ కూతురు ఏమిరా అలీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.హీరోయిన్ల అందాన్ని కూడా మైమరపించేలా ఉన్న ఏమిరా ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.