Journey Movie Heroine: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి చాల మంది హీరోయిన్ లు ఒకటి రెండు సినిమాల తర్వాత మాయమైపోతూ ఉంటారు.అలా వాళ్ళు చేసిన ఒకటి రెండు సినిమా లు హిట్ అయినప్పటికీ అవకాశాలు రాక సినిమాలకు దూరంగా ఉంటున్నారు.మరి కొంత మంది కెరీర్ మంచి ఊపు లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకొని సెటిల్ అయి పోతున్నారు.అలా కొన్ని సినిమాలలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ లలో అనన్య కూడా ఒకరు.
అనన్య అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ జర్నీ సినిమాలో అమృత అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు ఇప్పటికి టక్కున గుర్తు పట్టేస్తారు.రెండు బస్సులు గుద్దుకొని చాల మంది చనిపోయే కథాంశం తో తెరకెక్కింది జర్నీ సినిమా.
ఈ సినిమా లో అనన్య,అంజలి హీరోయిన్లుగా నటించారు.ఇక అనన్య తన క్యూట్ లుక్స్ తో,అమాయకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది.నితిన్,సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అ ఆ సినిమాలో హీరో నితిన్ కు చెల్లెలిగా అలరించింది అనన్య.
ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా మహర్షి లో నరేష్ కు జోడిగా నటించింది.అనన్య కు తెలుగులో కంటే మాలయంలోనే ఎక్కువ ఆఫర్లు రావడంతో అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది ఈ చిన్నది.
ఇక ఆ తర్వాత 2012 లో ఆంజనేయన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత కూడా అనన్య సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉండే.ఇక సోషల్ మీడియా లో చాల ఆక్టివ్ గా ఉండే అనన్య నిత్యం తన ఫ్యామిలీ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే అనన్య షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.