Devara: దేవర దావుది వాదీ సాంగ్ లో విశేషంగా అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..!

Devara

Devara: మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన దేవర సినిమా ప్రస్తుతం థియేటర్లలో సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర పై ముందు నుంచి సినిమా ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్లు,సాంగ్స్,టీజర్,ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులలో భారీగా హైప్ ను క్రియేట్ చేసాయి.అనుకున్నట్టుగానే ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇప్పటికే ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సెట్ చేస్తుంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించటంలో సినిమా యూనిట్ ఆనందం లో ఉన్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కు జోడిగా నటించింది.బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించారు.ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ పాత్రలో నటించారు.ఈ సినిమాలో దావుది వాదీ సాంగ్ చాల పెద్ద హిట్ అయ్యింది.అయితే మొదట సినిమాలో ఈ పాట లేదు.తర్వాత ఈ సాంగ్ ను థియేటర్స్ లో యాడ్ చేసారు.ఈ సాంగ్ లో జాన్వీ కపూర్ డాన్స్ అదరగొట్టింది.ఇక ఆమెతో పాటు సైడ్ డాన్సర్లు కూడా డాన్స్ ను ఇరగదీసారు అని చెప్పచ్చు.ముఖ్యంగా ఈ సాంగ్ లోని ఒక అమ్మాయి మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.దాంతో ఈ అమ్మాయి ఎవరు అని సోషల్ మీడియా మొత్తం గాలించేస్తున్నారు ఆమె అభిమానులు.చాల సినిమాలలో ఆమె సైడ్ డాన్సర్ గా చేసింది.ఈ అమ్మడి పేరు సిమ్రాన్ వర్మ.ఈమె కు సంబంధించిన ఫోటోలు వీడియొ లో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *