Tollywood Heroes: 1980 స్ లో టాలీవుడ్ స్టార్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…వీళ్ళలో ఎక్కువ రెమ్యూనరేషన్ ఎవరిదంటే

Tollywood Heroes: చెన్నై ఫిలిం ఇండస్ట్రీ చాల మంది పెద్ద పెద్ద టెక్నీషియన్స్ తో చాల పెద్దగా ఉండేది.1980 లో తమిళ సినిమాలకు ధీటుగా తెలుగు సినిమాలు చాలానే విడుదల అయ్యేవి.ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ తమిళనాడు నుంచి హైదరాబాద్ కు మార్చిన తర్వాత ఇండస్ట్రీలో చాల మార్పులు జరిగాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం అప్పటి స్టార్ హీరోలు ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ చాల కృషి చేసారు.ఆ తర్వాత దర్శక నిర్మాతలు అయినా డి రామానాయుడు,దర్శక రత్న దాసరి రావు ఇండస్ట్రీ కి కొత్త రూపాన్ని ఇచ్చారు.

అలాగే అక్కినేని ఫ్యామిలీ అన్నపూర్ణ స్టూడియోస్,కృష్ణ ఫ్యామిలీ పద్మాలయ స్టూడియోస్ మొదలుపెట్టారు.చాల ప్రొడక్షన్ హౌస్ లు ప్రారంభించిన అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నది సురేష్ ప్రొడక్షన్స్.అప్పట్లో సినిమాలకు వందల కోట్లలో బడ్జెట్ అయ్యేది కాదు.అలాగే స్టార్ హీరోలకు కూడా కోట్లలో రెమ్యూనరేషన్ ఉండేది కాదు.ఎన్టీఆర్ సినిమాలకు 50 లక్షల హైయెస్ట్ బడ్జెట్ ఉండేది.ఎన్టీఆర్ వి మాత్రమే అప్పట్లో హైయెస్ట్ బడ్జెట్ సినిమాలు ఉండేవి.

సౌత్ ఇండస్ట్రీలోనే పారితోషకంలో కూడా ఎన్టీఆర్ గారే టాప్ లో ఉండేవారు.ఆయన ఒక్క సినిమా కు 12 లక్షణాలు రెమ్యూనరేషన్ తీసుకునే వారట.ఆ తర్వాత ఏఎన్నార్ సినిమాలకు 30 నుంచి 40 లక్షలు బడ్జెట్ అయ్యేది.ఏఎన్నార్ గారు ఒక్క సినిమాకు 10 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకునేవారట.కృష్ణ గారి సినిమాలకు 20 నుంచి 30 లక్షల బడ్జెట్ అయ్యేది. ఆయన 7 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేవారట.

శోభన్ బాబు గారి సినిమాలకు 20 నుంచి 25 లక్షలు బడ్జెట్ అయ్యేది. ఆయన 6 నుంచి 7 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకునేవారట.ఒక్కప్పుడు సుమన్ కు ఇండస్ట్రీలో బాగా ఫాలోయింగ్ ఉండేది.ఆయన సినిమాలకు 17 లక్షలు బడ్జెట్ అయ్యేది. ఆయన 3 లక్షలు పారితోషకం తీసుకునేవారట.ఇక చిరంజీవి గారి సినిమాలకు 17 లక్షలు బడ్జెట్ అయ్యేది.చిరంజీవి గారు 3 నుంచి 4 లక్షలు పారితోషకం తీసుకునే వారని సమాచారం.

Leave a Comment