Vastu Tips: చాల మంది జ్యోతిష్య శాస్త్రం,వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారు.అయితే జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రం రెండింటిలోనూ తాబేలును శుభప్రదం గా పరిగణిస్తారు.విష్ణువు తో తాబేలు సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి విశ్వాసాల ప్రకారం విష్ణువు కూర్మ రూపంలో అవతరించాడు.అందుకే తాబేలు ఉన్న ఇంట్లో లక్ష్మి దేవి నివసిస్తుంది అని పండితులు చెప్తున్నారు.లక్ష్మి దేవికి చాల ప్రియమైన తాబేలును ఇంట్లో ఉంచడం వలన చాల పవిత్రంగా పరిగణించబడుతుంది.
ఇంట్లో తాబేలును పెంచుకోవడం కాబట్టి లోహం తో చేసిన తాబేలును ఇంట్లో పెట్టుకోవడం వలన తాబేలు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణును చెప్తున్నారు.లోహంతో చేసిన తాబేలును ఇంట్లో ఉత్తర దిశలో పెట్టుకోవడం వలన త్వరలో మీ కోరిక తీరుతుందని నిపుణులు చెప్తున్నారు.ఇంట్లో ఆర్ధిక సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఇంట్లో స్పటిక తాబేలును ఉంచుకోవడం వలన ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి.ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరైనా విద్యార్థుల దృష్టి చదువు మీద లేకుంటే వారు తమ స్టడీ టేబుల్ మీద ఇత్తడి లోహం తో చేసిన తాబేలును పెట్టుకోవాలి.
ఇలా పెట్టుకోవడం వలన విద్యార్థులు తమ పూర్తి దృష్టిని చదువు మీదనే కేంద్రీకరిస్తారు అని నిపుణులు సూచిస్తున్నారు.కొత్తగా వ్యాపారం లేదా ఉద్యోగం చేసే వాళ్ళు తాము పని చేసే చోట వెండితో చేసిన తాబేలు ను ఉంచుకోవడం వలన అక్కడ సంపద స్థిరంగా ఉంటుందని చెప్తున్నారు.లోహం తో చేసిన తాబేలును ఉంగరంగా పెట్టుకోవడం వలన చాల శుభ ఫలితాలు కలుగుతాయి అని నిపుణును చెప్తున్నారు.శుక్రవారం,అక్షయ తృతీయ,ధన్ తెరాస్,దీపావళి,ఇలా పవిత్రమైన రోజులలో లోహంతో చేసిన ఉంగరాన్ని పెట్టుకోవడం వలన లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది అని నిపుణులు చెప్తున్నారు.